వేమన పద్యం 4

వేమన పద్యం 4
వేమన పద్యం 4

అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనె మనుసు డుండు
ఇతరులరుగకున్న నీశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ

భావం: మనిషి తన మనస్సులో ఎన్నో దురాలోచనలు చేస్తూ ఎవరికి తెలియకుండా తెలివిగా తప్పించుకుంటాడు. సమాజంలో పెద్దమనిషిలా చెలామణీ అవుతుంటాడు. ఇతరులు తెలుసుకోకున్నా సర్వాంతర్యామి భగవంతుడు తెలుసుకోకుండా ఉంటాడా.