

వేమన పద్యం - 4
కర్మగుణములన్ని కడబెట్టి నడువక
తత్వమేల తనకు తగులు కొనును
నూనెలేని దివ్వె నువ్వుల మండునా
విశ్వదాభిరామ వినురవేమ
భావం: దీపం నూనె వలన మండుతుందేగాని, నువ్వులతో సాధ్యంకాదు. అట్టే మనలోని చెడు ఆలోచనలను వీడనాడి, సత్కర్మలను ఆచరించినప్పుడే తత్త్వజ్ఞానం అర్థమవుతుంది.