

భర్తృహరి సుభాషితములు 2
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవ మొసంగు జనులకు కలుషమడుచు
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిజేయు
సాధుసంగంబు సకలార్ధ సాధనంబు
భావం: సజ్జనులతో సాంగత్యం చేయడం అన్ని విధాల మంచిది. సత్యవంతుడుగా చేస్తుంది. బుద్దిబలాన్ని చేకూరుస్తుంది. గౌరవాన్నిస్తుంది. మనలోని లోపాలను పోగొడుతుంది. కీర్తి కలిగిస్తుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒకటేమిటి అనేక విధాలైన సుగుణాలను సంపాదించే సాధనం సత్ సాంగత్యం.