కాళహస్తీశ్వర శతకం 1

కాళహస్తీశ్వర శతకం 1
కాళహస్తీశ్వర శతకం 1

ఏ వేదంబు పఠించె లూత? భుజగంబే శాస్త్రము ల్చూచె? దా
నే విద్యాభ్యసనంబొనర్చెఁగరి? చెంచెమంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు: మీపాద సం
సేవాసక్తి యెకాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావంః ఏ వేదాలను పఠించి సాలెపురుగు, శాస్త్రాలు తిరగవేసి పాము, ఏ విద్యలను ఏనుగు, ఏ మంత్రాలు వల్లించి తిన్నడు కైవల్యాన్ని పొందారు. చదువులు జ్ఞానాన్ని కలిగించలేవు, మోక్షాన్ని ప్రసాదించలేవు. పాదసేవ ఒక్కటే తరుణోపాయం.