

కుమార శతకం 1
విత్తంబు విద్య కులము
న్మత్తులకు మదంబొసంగు; మాన్యులకున్ స
ద్వృత్తి నొసంగున్ వీనిన్
జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా
భావం: ధనం, గొప్ప విజ్ఞాన, సద్వంశం దుర్మార్గులకు గర్వాన్ని కలిగిస్తుంది. ఈ త్రిగుణాలే సజ్జనులకు మంచిని కలుగుచేస్తాయి. వీటిని గుర్తించుకొని ప్రవర్తించుము.