

పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొని భారతదేశ పురోగతిని కొనసాగించడం, వేగవంతం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలను పునరుద్ధరించి వాటిని బలోపేతం చేయడం కోసం ప్రత్యేక కృషి అవసరం అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2023-24 ప్రవేశపెడుతూ అన్నారు. 2014 నుండి, భారతదేశం కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనలో అలాగే పౌరుల శ్రేయస్సు లక్ష్యంగా ప్రత్యక్ష ప్రయోజన పథకాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని, ఈ పరివర్తన ప్రయత్నాలలో సివిల్ సర్వీసెస్ ప్రధాన భూమిక పోషించినట్లు సర్వే తెలిపినది.
ఒక సమస్యను సులభంగా పరిష్కరించగల ఉప-విభాగాలుగా విభజించే మిషన్ కర్మయోగిని ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ సామర్థ్యాలను పెంపొందించడంలో గల సవాళ్లకు ప్రభుత్వం ధీటుగా స్పందించినట్లు సర్వే పేర్కొన్నది. కార్యాలయంలోని బాధ్యతలు, కార్మికుల సామర్థ్యాలను అనుసంధానించడం ద్వారా ఈ కార్యక్రమం సామర్థ్యాల పెంపు, మానవ వనరుల నిర్వహణ మధ్య అత్యావశ్యకమైన వారధిని రూపొందిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది.
వ్యవసాయరంగం సగటు వార్షిక వృద్ధి 4.18శాతం
వ్యవసాయ రంగం గత ఐదు సంవత్సరాల్లో 4.18 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. నూనెగింజల సాగు విస్తీర్ణం మొత్తం 2014-15లో (17.5 శాతం వృద్ధితో) 25.60 మిలియన్ హెక్టార్ల నుంచి 2023-24 నాటికి 30.08 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. భారతీయ వ్యవసాయ రంగం దేశ జి డి పి లో 18.2 శాతం వాటాతో సుమారు 42.3 శాతం జనాభాకు జీవనాధారాన్ని అందిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. గత ఐదు సంవత్సరాల్లో స్థిరమైన ధరలపై వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 4.18 శాతం నమోదు చేసుకుని, 2023-24కు తాత్కాలిక అంచనాల ప్రకారం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 1.4 శాతంగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ఆర్థిక సర్వే ప్రకారం, వ్యవసాయ పరిశోధనలో పెట్టుబడి మరియు అనుకూల విధానాలు ఆహార భద్రతకు బాగా తోడ్పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయ పరిశోధన (పరిపాలనతో సహా)లో పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడి కి ₹13.85 రాబడి ఉంటుందని అంచనా. 2022-23లో, వ్యవసాయ పరిశోధన కోసం ₹19.65 వేల కోట్లు ఖర్చు చేశారు.
పారిశ్రామిక రంగంలో 9.5 శాతం వృద్ధి
పారిశ్రామిక రంగం ధృఢమైన 9.5శాతం వృద్ధి రేటును సాధించినట్టు 2023-24 ఆర్థిక సర్వే పేర్కొంది. గత దశాబ్దంలో భారతీయ తయారీ రంగం, పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉందని, సగటు వార్షిక వృద్ధి రేటు 5.2 శాతం సాధించిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఎఫ్ వై 23లో ఈ రంగం 14.3 శాతం స్థూల విలువను జోడించింది, అదే కాలంలో 35.2 శాతం ఉత్పత్తి వాటా సాధించింది. తద్వారా ఈ రంగం గణనీయమైన ముడిసరుకు ఉత్పత్తి అనుసంధానాలను కలిగి ఉందని సూచిస్తుంది. ఎఫ్ వై 24లో హెచ్ ఎస్ బి సి ఇండియా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీ ఎం ఐ ) తయారీ సూచిక అన్ని నెలల్లో 50 ప్రమాణవిలువ కంటే బాగా ఎక్కువగా ఉందని ఇది భారత తయారీ రంగంలో స్థిరమైన విస్తరణ మరియు స్థిరత్వానికి నిదర్శనమని ఆర్థిక సర్వే పేర్కొంది.
బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగం
నిరంతర ప్రపంచ రాజకీయ సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్, ఇతర ఆర్థిక రంగాల్లో మంచి పనితీరును కనబరిచిందని నిర్మలా సీతారామన్ అన్నారు. మొత్తం ద్రవ్యోల్బణ రేటు నియంత్రణలో ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ ఏడాది పొడవునా స్థిరమైన పాలసీ రేట్లను కొనసాగించిందని సర్వే పేర్కొంది. మార్కెట్ క్యాపిటలైజేషన్, జీడీపీ నిష్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా, భారత్ 5వ స్థానంలో నిలిచింది. మూలధన సృష్టిలో ప్రాథమిక మార్కెట్లు 2023 ఆర్థిక ఏడాదిలో రూ.9.3 లక్షల కోట్లు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.10.9 లక్షల కోట్లు సృష్టించాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల సంఖ్య 66 శాతానికి పెరిగి 272కు చేరింది. నిఫ్టీ 50 ఇండెక్స్, 2023 ఆర్థిక సంవత్సరంలో (-)8.2 శాతంగా కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 26.8 శాతం పెరిగింది. ఎన్ఎస్ఈలో 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు మూడు రెట్లు పెరిగి 9.2 కోట్లకు ఇన్వెస్టర్ల సంఖ్య చేరింది. వ్యవసాయ రుణాలు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ .13.3 లక్షల కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .20.7 లక్షల కోట్లకు చేరి దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. చిన్న, పెద్ద పరిశ్రమలకు బ్యాంకు రుణాలు పెరగడం వల్ల 2024 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో పారిశ్రామిక రుణ వృద్ధి పుంజుకుంది. ఏడాది క్రితం 5.2 శాతం వృద్ధి ఉండగా, 2024 మార్చిలో 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తగ్గిన నిరుద్యోగ రేటు
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్) డేటా ప్రకారం, గత ఆరేళ్లలో భారతదేశం కార్మిక మార్కెట్ సూచికలలో మెరుగుదల చూసిందని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. నిరుద్యోగిత రేటు 2022-23 లో 3.2 శాతానికి తగ్గింది. ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి, నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశం ఉపాధి విషయంలో గణనీయమైన మార్పును చూసిందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. మహిళా శ్రామిక శక్తి, స్వయం ఉపాధి వైపు మళ్లుతోందని, గత ఆరేళ్లలో మహిళా ఎల్ఎఫ్‌పీఆర్ గణనీయంగా పెరగడం, గ్రామీణ మహిళలు వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాల్లో చేరడం ద్వారా పురుష శ్రామిక శక్తి వాటా స్థిరంగా ఉందని సర్వే పేర్కొంది.
కర్మాగార ఉద్యోగాలలో ప్రగతి
గత ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కనిపించిన అధిక వేతన వృద్ధితో పాటు వ్యవస్థీకృత తయారీ రంగం మహమ్మారి పూర్వ స్థాయికి కోలుకుందని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సృష్టికి బాగా దోహదం చేస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కార్మికుడి వేతనాలు 6.9 శాతం సీఏజీఆర్ (కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు)గా, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం సీఏజీఆర్ పెరిగాయి. ఫ్యాక్టరీల్లో 40 శాతానికి పైగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. అయినప్పటికీ, 2018-2022 ఆర్థిక సంవత్సరా మధ్య అత్యధిక ఉపాధి వృద్ధి ఛత్తీస్‌గఢ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తో సహా యువ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కనిపించింది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కెమికల్స్ ధరలు పెరుగుతున్నాయని, భారత తయారీ విలువ గొలుసును పెంచుకుంటోందని, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే రంగాలుగా ఆవిర్భవించాయని సర్వే పేర్కొంది.
గ్రామీణ వేతనాలలో పెంపు
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ వేతనాలు ప్రతి నెలా 5 శాతానికి పైగా పెరిగాయని, సగటున వ్యవసాయంలో నామమాత్రపు వేతన రేట్లు పురుషులకు 7.4 శాతం, మహిళలకు 7.7 శాతం పెరిగాయని పేర్కొంది. ఇదే సమయంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో వేతనాల పెరుగుదల పురుషులకు 6.0 శాతం, మహిళలకు 7.4 శాతంగా ఉంది. అంతర్జాతీయ సరుకు ధరలు, దేశీయ ఆహార ధరల సడలింపుతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, ఇది వాస్తవ వేతనాల్లో స్థిర పెరుగుదలకు దారితీస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
మెట్రోవాసులలో అత్యధికంగా మానసిక రుగ్మతలు
ఆర్థిక సర్వే 2024 గతం లో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆర్థిక స్థాయిలో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించింది. వ్యక్తిగత, జాతీయ అభివృద్ధికి మానసిక ఆరోగ్యాన్ని ప్రధాన ప్రభావవంతమైన చోదక శక్తిగా అంగీకరిస్తూ, నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (ఎన్ఎంహెచ్ఎస్) 2015-16 ప్రకారం, భారతదేశంలో 10.6% మంది పెద్దలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. మానసిక రుగ్మతలకు అందించే చికిత్సలలో వ్యత్యాసం వివిధ రుగ్మతలకు 70% నుండి 92% మధ్య ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలు (6.9%), పట్టణేతర మెట్రో ప్రాంతాలు (4.3%) తో పోలిస్తే పట్టణ మెట్రో ప్రాంతాల్లో (13.5%) మానసిక రుగ్మతల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఎన్ సి ఇ ఆర్ టి మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ సర్వేను ఉటంకిస్తూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా కౌమారదశలో మానసిక ఆరోగ్యం క్షీణించడం పెరుగుతోందని సర్వే తెలిపింది. 11% మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, 14% మంది తీవ్రమైన ఉద్వేగానికి గురవుతున్నారని, 43% మంది ఆకస్మిక ఉద్వేగ మార్పులను (మూడ్ స్వింగ్స్) అనుభవిస్తున్నారని పేర్కొంది.
మొత్తం ఆర్థిక స్థాయిలో, గైర్హాజరు, ఉత్పాదకత తగ్గడం, వైకల్యం, పెరిగిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మొదలైన వాటి వల్ల మానసిక ఆరోగ్య రుగ్మతలు గణనీయమైన ఉత్పాదకత నష్టాలతో ముడిపడి ఉన్నాయని సర్వే పేర్కొంది. ఒత్తిడితో కూడిన జీవన పరిస్థితులు, ఆర్థిక అస్థిరత , పైకి ఎదిగే అవకాశాలు లేకపోవడం వల్ల పేదరికం మానసిక ఆరోగ్య ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని కూడా ఆధారాలు ఉన్నాయి, ఇవి మానసిక క్షోభను పెంచడానికి దోహదం చేస్తాయి. దేశ ప్రజలలో మానసిక ఆరోగ్యాన్ని క్షేత్రస్థాయిలో మెరుగుచేయడానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆర్థక సర్వేలో కొన్ని సిఫారసులను చేసింది. వీటిలో ముఖ్యంగా, 2021లో ప్రతి లక్ష జనాభాకు 0.75 మంది మానసిక వైద్యులుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణానికి అనుగుణంగా లక్ష జనాభాకు మానసిక వైద్యుల సంఖ్యను మూడుకు పెంచే ప్రయత్నాలను రెట్టింపు చేయడం, రుగ్మతలను ముందస్తుగా గుర్తించడం కోసం ప్రీస్కూల్, అంగన్ వాడీ స్థాయిలో మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడం, పాఠశాలల్లో మానసిక ఆరోగ్య జోక్యాలను ఏకీకృతం చేయడానికి ఉపాధ్యాయులు , విద్యార్థులకు వయస్సు-తగిన మానసిక ఆరోగ్య పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయడం, ముందస్తు జోక్యం , సానుకూల భాషను వేగవంతం చేయడం, కమ్యూనిటీ-స్థాయి పరస్పర చర్య.లను ప్రోత్సహించడం , సాంకేతికత పాత్రను సమతుల్యం చేయడం మొదలైనవి సమర్థవంతమైన మార్గాలు.
తేటగీతి