

చిరకాల అనుభవం కలిగిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ ఆద్వాణీకి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత్ రత్న’ తో గౌరవించనున్నట్టు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం ద్వారా ఒక సందేశంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆద్వాణీకి స్వయంగా ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యంలో పోస్ట్ చేసిన ఒక సందేశంలో –
‘‘శ్రీ ఎల్.కె. ఆద్వాణీగారికి భారతరత్నను ప్రధానం చేయనున్నట్టు తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయనతో నేను మాట్లాడాను కూడా. ఈ సత్కారంతో ఆయనకు గౌరవం లభించనుండడం పట్ల ఆయనకు అభినందనలను తెలియజేశాను. సమకాలీన రాజకీయాల్లో అమిత మాన్యుడు అయినటువంటి రాజనీతిజ్ఞులలో ఒకరైన ఆయన భారతదేశం యొక్క అభివృద్ధికి అందించిన తోడ్పాటు మహత్తరమైంది. అట్టడుగు స్థాయితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం మన దేశానికి ఉపప్రధానిగా సేవలను అందించడం వరకు ఆయన ఎదుగుతూ వచ్చింది. ఆయన మన దేశానికి హోం శాఖ మంత్రి గాను మరియు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేసి పేరు తెచ్చుకొన్నారు. ఆయన ఎంతో అవగాహనతో ప్రవేశపెట్టిన పార్లమెంటరీ సంప్రదాయాలు భావితరాల వారికి మార్గదర్శకాలు.”
“సార్వజనిక జీవనంలో ఆద్వాణీ గారు దశాబ్దాలు పాటు చేసిన సేవలలో పారదర్శకత్వానికి మరియు అఖండతకు తిరుగులేనటువంటి నిబద్ధతను చాటిచెప్పి రాజకీయ నైతిక పంథాలో ఒక మార్గసూచకమైన ప్రమాణాన్ని నెలకొల్పాయి. జాతీయ ఏకత్వాన్ని మరియు సాంస్కృతిక పునరుజ్జావనాన్ని పెంపొందింప చేసే దిశలో ఆయన సాటి లేనటువంటి ప్రయాసలకు నడుం కట్టారు. ఆయనను భారతరత్నతో సత్కరించడం అనేది చాలా ఉద్వేగభరితమైనటువంటి క్షణంగా నాకు అనిపిస్తోంది. ఆయనను కలిసి మాట్లాడి, మరిన్ని విషయాలను నేర్చుకొనే అవకాశం అనేక మారు దక్కడం నాకు లభించిన సౌభాగ్యం అని నేను ఎల్లప్పటికీ భావిస్తుంటాను.” అని పేర్కొన్నారు.
February 2, 2024