

కృష్ణశతకం - 3
దిక్కెవ్వరు ప్రహ్లాదకు
దిక్కెవ్వరు పాండుసుతులకు దీనుల కెపుడున్
దిక్కెవ్వర య్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా
భావం: పరమభక్తుడైన ప్రహ్లాదునకు, పాండవులకు, అహల్యకును ఎవరైతే రక్షకుడో ఆ కృష్ణుడే నాకును, మీకును రక్ష.