నారికేళపాకము అవధానము
12 Apr 2024

తెలుగు పద్యము నింటింట త్రిప్పువిద్య తెలుగు సంస్కృతి ఇన్నేళ్లు నిలుపు విద్య ఎట్టి విశ్వ భాషలనైనా లేని విద్య ధ్యానయోగమ్ము మా అవధాన విద్య అని మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు తెలుగువారికి మాత్రమే సొంతమైన అవధాన విద్య గురించి చెప్పిన మాటలివి. అవధానమంటే, ఏకాగ్రత, ధీవ్యగ్రత. ధారధారణ శక్తుల విలక్షణ సంగమం అన్నారు సినారె..