రాగ గీతిక  7 మధ్యమావతి (22వ మేళకర్త ఖరహరప్రియ జన్యం)
19 Sep 2023

రాగాలాపన, స్వరకల్పన, నెరవు కలిగిన శుభప్రదమైన రాగం మధ్యమావతి. కర్ణాటక సంగీత కచేరీలలో ఏవైనా అపస్వరా దోషాలు దొర్లితే, దోష నివారణకు చివర్లో ఈ రాగాన్ని పాడటం ఒక సాంప్రదాయంగా ఉంది. 22వ మేళకర్త ఖరహరప్రియ దీని జన్య రాగం. ఇది ఉపాంగ, ఔడవ- ఔడవ రాగం. మధ్యమావతి శ్రీరాగానికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ రాగం స్వర స్థానాలు: షడ్జమం, చతుశ్శ్రుతి రిషభం, శుద్ధమధ..