
సంగీతము యొక్క ఔనత్యమును గ్రహించి, పదుగురు సుళువుగా అభ్యసించడానికి మాయామాళవగౌళ రాగంలో స్వరావళులు మొదలు కీర్తనల వరకు రచనలు చేసిన సంగీతనిధి, కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. కన్నడ భాషలో విరివిగా రచనలు చేసిన పురందరదాసు నారదాంశమని ప్రతీతి. పురందరదాసు 1484వ సంవత్సరంలో బళ్లారి జిల్లాలోని హంపి దగ్గర గల పురందరగడ్ లో కమలాంబ, వరదప్పనాయక్ ..
దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా || వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ తక్కినవి భాండారాన - దాచి వుండనీ వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా || నానాలికపైనుండి - నానాసంకీర్తనలు పూని నాచే నిన్ను -బొగడించితివి వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవ..
నాలుగైదు సంవత్సరాల క్రితం అన్నమయ్య సంకీర్తనార్చన అని ఒక కార్యక్రమం చేసి, ఆ వాగ్గేయకారుని కీర్తనలు ఆలపించాం. అప్పుడు ఆరేళ్ల మా అమ్మాయి కూడా నాలుగైదు కీర్తనలు పాడి మా బంధువర్గానికి ముఖ్యంగా మా అత్తమామాలకి కొంచెం ఆశ్చర్యం, కొంచెం సంతోషం, కూసింత గర్వ కల్గించింది. ఆ కార్యక్రమం వీడియో మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా, వద్దననీయక..
‘కావ్యేషు నాటకం రమ్యమ్, నాటకేషు శకుంతలమ్ – అందులో చతుర్ధాంకం అందులో శ్లోకచతుష్టయమ్’, అన్న పంథాలో కావ్యరమ్యత్వాన్ని వెతుకుతున్నారు. అలాగే సంస్కృతీ మహద్భాగ్యాలు వెతుక్కుంటూ పోతే, సందేహంలేని జవాబు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు సౌభాగ్య నిధులు! అని త్యాగరాజ సంగీతజ్ఞులు ఒకానొక సందర్భంలో శ్రీ టి.వి. సుబ్బారావుగారు పేర్కోన్నారు. త్..
మన తెలుగులో తొలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య నందవరవైదిక బ్రాహ్మణ వంశమున నేటి కడప జిల్లా రాజంపేట తాలుకాలోని తాళ్లపాక గ్రామమంలో వైశాఖశుద్ధ పౌర్ణమినాడు (మే 9, 1408) జన్మించాడు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. భారద్వజ గోత్రుడైన అన్నమయ్య తండ్..
మాయామాళవగౌళ రాగం 3వ అగ్నిచక్రంలో 3వ రాగం. ఫూర్వం దీనిని మాళవగౌళ రాగం అని పిలిచేవారు. కటపయాది సంఖ్య విధానానికి అనువయించడం కోసం ఈ రాగానికి మాయా అనే పదాన్ని చేర్చారు. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం (స,రి,గ.మ,ప,ద,ని,స / S R1 G3 M1 P D1 N3 S). ఇది నిర్ధుష్ట రూపం కలిగిన సంపూర్ణ రాగం. అచల స్వరములు, కంప..