
భారత దేశంలో ఏ మూలకెళ్లినా రామాయణ గాథ వినపడక మానదు! తెలుగునాట నాలుగు ఇళ్లున్న వాడలో రామ మందిరం లేకుండా ఉండదు! తెలుగునాట రామాయణం నిత్య పారాయణ గ్రంథం. ‘శ్రీరామ’ పదం చుట్టకుండా తెలుగువాడెవడు రాత మొదలెట్టడు.‘శ్రీ రామ రక్ష’ అని బిడ్డలను ఆశీర్వదించని తల్లీ ఉండదూ. పవిత్ర గోదావరీ తీరం సీతారాముల పాద స్పర్శతో పావనమగుచేత కామోసు సీతారాముడు ఆంధ..
‘కర్మణా బధ్యతే జంతుః’ మనిషి కర్మ అనే చక్రబంధంలో చిక్కుకుని ఉన్నాడు. ఈ చక్రబంధనాన్ని చేధించుకుని బయటపడితే కాని జ్ఞానయోగం ప్రాప్తించదు. అయితే కర్మాచరణ గొప్పదా, జ్ఞానం గొప్పదా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగకమానదు. కర్మయోగం, జ్ఞాన యోగం రెండూ మోక్షమార్గాలే. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయా నఘ! జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయో..
పూరీ జగన్నాథ రథయాత్రకి ప్రప్రంచ ప్రసిద్ధి ఉంది. ‘పురుషోత్తమ క్షేత్రం’గా పురాణాలలో వర్ణింపబడే ఈ పావన ధామం అద్భుతాలకు ఆలవాలం. ‘జగన్నాథ స్వామి నయన పథగామీ భవతుమే’ అని ఆదిశంకర భగవత్పాదులు ఈ స్వామి తన కళ్లముందు నిరంతరం కదలాడాలని ప్రార్ధించి, తన నాలుగు పీఠాలలో ఒక దానిని ఇక్కడే ప్రతిష్టించాడు.జయదేవుని ‘గీతగోవిందం ’ఈ స్వామి ఆరాధనయే. ‘ఇ..
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద: ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్ముజుడైన రాముడిగా అవతరించగా పరమాత్మ గుణవర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామయణ రూపంలో వెలువడిందని ఈ శ్లోకం అర్ధం. భారతీయ సంస్కృతి కాధారమై, దానిని సర్వప్రశంసా పాత్రముగా చేసిన కుటుంబ జీవితానికి..
వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61 అధ్యాయం నుంచి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణంగా ఖ్యాతి చెందింది. వాల్మీకీయములో కథ ప్రథానం కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచనము మిక్కిలి ప్రధానము. నీటి కొలది తామర వలే వాల్మీకీయము తరచి చూచిన కొద్ది అందుగల ఆధ్యాత్మిక విశేషములు వెలికి వచ్చును. వాల్మీకి కథ చెప్పు వి..
అవ్యక్తో యమచింత్యో య వికార్యోయముచ్యతే| తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 || అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత| అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 || ఆత్మ అవ్యక్తమైనది. అనగా ఇంద్రియగోచరముగానిది, మనస్సునకు అందనిది. వికారములు లేనిది. జనన మరణాల మధ్య మాత్రమే ఇంద్రియగోచరాలు ప్రకటితమవుతాయి. ఆత్మ జననమరణాలకు అతీతమైనది. నా..
వాలి సుగ్రీవులకు మేనల్లుడను నేను వల్లభుల బంటునమ్మ ఆ వాయుసుతుడను, హనుమంతుడు నా పేరు సీతమ్మ నమ్మవమ్మ అంటూ ఎంతో ఆర్తితో హనుమంతుని ద్వారా సీతమ్మవారిని, జానపదులు భావుకతతో అర్ధించిన తీరు ఆ సీతమ్మవారినే కాదు మనందరిని కూడా అలరించకమానదు. వాల్మీకి రామాయణం కిష్కిందకాండలో ప్రవేశించే హనుమత్ స్వరూపం భగవత్ సౌందర్యాన్ని ప్రతిపాదించి, పరబ్రహ..
పంచమవేదంగా పిలవబడే మహాభారతం మనకు నిత్యం పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం (అనుశాసనిక పర్వం), శ్రీమద్భగవద్గీత (భీష్మపర్వం 25వఅధ్యాయం నుంచి 42వ అధ్యాయంవరకు)లను అందించింది. 18 అధ్యాయాలు గల భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను, యోగ సాధనాలను విశదీకరించాడు. భగవద్గీతకు ఎందరో అర్ధాల..