
ఈ మధ్య మా స్నేహితులం కొందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా, మా చర్చ తెలుగు భాష మీదకు మళ్లింది. మా స్నేహితురాలు చప్పున ‘తెలుగు భాషలో, తెలుగువారిలో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత’ అని వాపోయారు. చర్చ అక్కడ నుంచి మాంఛీ రసపట్టు మీద సాగిందని మీకు నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటాను! చర్చ మాట ఎలా ఉన్నా, ఆవిడన్న మాటల్లో కొంత నిజం లేకపోలేదనిపించ..
పేరడీ అనగానే మనలో చాలామంది దాన్ని ఏదో వెంట్రుక తీసిపారేసినట్టు పారేస్తారు. పేరడీ అంటే అనుకరుణ. అనుకరించటం అంటే తేలికని మన అభిప్రాయం. తల్లి పిల్లలకు మాటలు నేర్పేటప్పుడు చేసే ప్రయత్నం ఏమిటి? అనుకరణే! కానీ ఆ అనుభూతి వేరు. అది అనుకరణగా అన్పించదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏవరినో ఒకరిని ఏదో ఒకదాన్ని అనుకరిస్తున్నాం. అనుకరిస్తూనే ఉం..
పెద్దవాళ్లు ఏదైనా మాట్లాడే ముందు ‘ఏదో సామ్యం చెప్పినట్టు’ అనడం కద్దు. ఈ సామ్యం లేదా సామ్యత నుంచి వచ్చినదే ‘సామెత.’ సామెతనే లోకోక్తి లేదా నానుడి అని కూడా అంటారు. సామ్యత అంతే పోలిక, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం. "లోకోక్తిముక్తావళి" అనే సంకలనం ఉపోద్ఘాతంలో సామెతను ఈ విధంగా నిర్వచించారు -- సంస్కృతమున "లోకోక్తులు" లేదా "న్యాయములు" అనువానిని తెలుగు..
ప్రజల సంభాషణల్లో తరచూ చోటు చేసుకుని కాలక్రమేణా భాషలో స్థిరత్వాన్ని పొందే పదాలను, వ్యాఖ్యలను జాతీయాలు లేదా నానుడులు అంటారు. వీటినే ఇంగ్లీషులో “idioms” అంటారు. మనకు తెలియకుండానే అనేక జాతీయాలను మన సంభాషణల్లో ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు అరికాలిమంట నెత్తికి ఎక్కింది, తూచా తప్పకుండా, ఈడు, జోడు, అడుగులకు మడుగులొత్తడం, కట్టె, కొట్టె, తెచ్చె, మొదలగ..
నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బైటకుక్క చేత భంగపడును స్థానబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ! నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ. త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్క..
తెలుగు తీయనైనది. సొగసైన నుడికారం కలది. మధురమైన కవితలు కలది. సొగసైన రచనలు, సామెతల, జాతీయాల, సూక్తుల సొబగును కూర్చుకున్న మధుర భాష. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు, అన్నీ ఉన్న ఈ భాషను, సంస్కృతిని పరిరక్షించే తెలుగువారు ఆనాడు, ఈనాడు కూడా కరువయ్యారు. ఇక తెలుగు గ్రామీణుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, పండగలు పబ్బాలు, గ్రామీణ దేవతలు, పూ..
‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు. ‘‘నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్ దివ్వెలు – కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులు వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్క విశుద్ధమైనవే నవ్వులు – సర్వము దుఃఖదమనం..
హరికిదొరికెనందురా సిరియపుడె దొరికెకాదె విషము హరునకరయ ఎవనికెట్టులగునొ ఎవ్వడెరుంగును విశ్వదాభిరామ వినురవేమ క్షీరసాగర మథనం క్షీరసాగర మథనంలో ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ హరిని చేరింది. అప్పుడే పుట్టిన హాలాహలాన్ని హరుడు మింగటంతో ఆ విషం శివుని కంఠంలో స్థిరపడింది. దేవదానవులు మందరగిరి వద్దకు వెళ్లి దానిని సాగరంలోకి చేర్చాలన..