
దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షసశక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’. నవరాత్రుల పూజ ..
శరన్నవరాత్రులు పదిరోజుల ఉత్సవం. శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని పూజిస్తారు. అందువల్లనే ఈ ఉత్సవాలని ‘దేవీ నవరాత్రులని’ కూడా పిలుస్తారు. పండుగ మొదటి మూడురోజులు పార్వతీదేవిని, తర్వాతి మూడురోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు సరస్వతీదేవిని పూజిస్తారు. అందు తొలిరోజు కనకదుర్గాదేవి, రెండోరోజు బాలా త్రిపుర స..
విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమచైతన్యి జగదంబగా ఆరాధించే సాంప్రదాయం శాక్తేయం. ఏ ‘శక్తి’ వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాగమాల వరకు ఆ జగన్మాతను దేవీ నామంతో కీర్తించాయి. ఈ నామానికి ‘ప్రకాశ స్వరూపిణి’ అని అర్ధం. అన్నింటికీ చైతన్యాన్ని ప్రసాదించే స్వయంప్రకాశక శక్తి దేవి. మరొక అర్ధం క్..
‘భగవతః చరితం భాగవతమ్’. భగవంతుని చరితము భాగవతము. ప్రపంచోత్పత్తి, ప్రళయము, భూతలముల ఆగమనగమనములు, విద్యావిద్యలు ఎవరికి తెలియునో ఆతడు భగవంతుడని ప్రాచీన పండితులు నిర్ధేశించారు. నిర్గుణ, సుగుణాత్మకుడైన ఆత్మస్వరూప నిరూపణమే భాగవత కథ. వ్యాసుడు రచించిన అష్టాదశపురాణాలలో అత్యంత విశిష్టమైనది భాగవతం. గాయత్రి ఆధారంగా ధర్మ ప్రబోధము కలిగి, 18వేల శ్..
హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు. 'రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములన..
వసంత రుతువు ఆరంభంలో వచ్చే ప్రధాన పండుగ ఉగాది లేదా యుగాది. 'యుగము' అనగా ద్వయము లేక జంట అని అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. కాలక్రమేణా యుగాది ఉగాదిగా స్థిర పడింది. అయితే "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గ’ అంటే జ్ఞానం అనే అ..
మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం .... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన. శ్రావణ మాసం కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. వర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం’ అని శ్రీ సూక్తం వర్ణించినట..
విఘ్నసంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలుగినప్పుడు, బ్రహ్మ ఓంకార ధ్యానంచేయగా, ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటుతర్వాత పార్వతీపరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్త్వం, ప్రకృతీపురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతక..