
రామాయణ, భారత, భాగవతాలు మన జనజీవన స్రవంతిలో మిళితమై, మన కళలను కూడా ప్రభావితం చేశాయి. శిష్టులకు పురాణేతిహాసాలు కావ్యాల రూపంలో అందుబాటులో ఉంటే, పామరులకు ఆ లోటును మన జానపద కళలు తీర్చాయి. రామాయణం ఈ విషయంలో ముందుందని చెప్పవచ్చు. రసమయ రామాయణం ఒక తరం నుంచి మరో తరానికి అందచేయటంలో జానపద గేయాలు ఎంతగానో ఉపకరించాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగ..
మాఘ బహుళ చతుర్దశినాడు మనం "మహాశివరాత్రి" పర్వదినం జరుపుకుంటాం. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం గురుంచి చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద..
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ సనాతన ధర్మం మనకిచ్చిన రెండు అద్భుత మహామంత్రాలివి. ఒక మంత్రం నారాయణుడిని స్మరిస్తే, మరొకటి శివుడిని ఆరాధిస్తుంది. మనలో కొందరికి మహేశ్వరుడి కారుణ్యమూ, ప్రసన్న రూపమూ, ఏ వరం కోరినా కాదనకుండా ప్రసాదించే భోళాతనమూ నచ్చుతాయి. మరి కొందరికి, సాత్విక గుణస్వరూపుడైన విష్ణుమూర్తి, ఆయన అనేక అవతారాలలో చేసిన లీలలు మహాప..
ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి: • ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి) • కార్తీక శుద్ధ ఏకాదశి • పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశ..
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా గీత శ్రీపద్మనాభుడైన విష్ణుభగవానుని ముఖారవిందము నుండి వెల్వడిందని వ్యాసుడు భగవద్గీతను వర్ణిస్తూ తెలిపాడు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో భోధించాడని అందరికి తెలుసు. కానీ భగవద్గీత ఆవిర్భావం సంగ్రామం పదకొండవనాడు ..
మాఘ శుద్ధ సప్తమినాడు మనం రథ సప్తమి జరుపుకుంటాం. ఈ రోజు సూర్య జయంతి. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసిన ఈ రోజుకి విశిష్టత ఉంది. ఈ రోజు నుంచే సూర్యుడు తన సంచార గతిని మార్చుకుని ఉత్తర దిశవపైపు పయనం ఈరోజే ప్రారంభస్తాడు. భూమి, సూర్యునికి దగ్గరవటం ఆరంభిస్తుంది. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ (నమ..
రామాయన్న పదమ్మువిన్న నిదె సర్వస్వమ్ము నుప్పొంగి, ఏ సామోద్గీథములో ధ్వనించు రసవేషా! నాడులే తంత్రులై ఆమోదమ్ముగ లీలగా బ్రతుకు తానై రామసంకీర్తన మ్మై మాధుర్య తరంగమౌను శుభధామా! రామచన్ద్రప్రభూ! సామము గీతాత్మక నాదం. దానికి సారం – ఓంకారం, అదే శ్రీరామ నామం. ఆ కారణంచేత, రామస్మరణ రసవంతమైన ప్రణవానికీ, ప్రణవ జన్యమైన గీతానికి హేతువౌతోంది. ఓంకార స..
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. 'న కార్తీక నమో మాస: న దేవ కేశవా త్పరమ్! నచ వేదం నమం శాస్త్ర, న తీర్థం, గంగా యాన్స్ మమ్!!' అంటారు. ఈ మాస..