

వెలకాంత లెందరైనను
కులకాంతకు సాటిరారు కువలయ మందున్
పలు విద్య లెన్ని నేర్చిన
కుల విద్యకు పాటిరావు గువ్వల చెన్నా.
భావం: వేశ్యలెంతమంది ఉన్నా, తన భార్యతో సమానంకారు. అలాగే ఎన్ని విద్యలు నేర్చినా కుల విద్యకు సాటిరాదు.
...

సలిలతరామనామజపసారమెరుంగను కాశికాపురీ
నిలయుడగాను, మీ చరణనీరజరేణుమహాప్రభావముం
తెలియ నహల్యగాను, జగతీవర, నీదగు సత్యవాక్యముం
తలపగ రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసమున్
తలచి నుతింప నాతరమె? దాశరథీ కరుణాపయోనిధి
భావం: నీ నామపారయణం చేత కలిగే శక్తి కాశీ విశ్వేశ్వరుడికి తెలియును. నీ పాదదూళి యొక్క మహిమ అహల్యా దేవికి తెలియును. నీ సత్యవాక్కులో.....

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నడు గల్గు భారతీ
భావం: తెల్లని కాంతులు వెల్లివిరిసే శరన్మేషు కందంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చకర్పూరమూ, పటీరమూ, రాజహంసలు, జాజిచెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా, రెల్లుపూలు, ఆదిశేషుడూ, మల్.....

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవ మొసంగు జనులకు కలుషమడుచు
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తిజేయు
సాధుసంగంబు సకలార్ధ సాధనంబు
భావం: సజ్జనులతో సాంగత్యం చేయడం అన్ని విధాల మంచిది. సత్యవంతుడుగా చేస్తుంది. బుద్దిబలాన్ని చేకూరుస్తుంది. గౌరవాన్నిస్తుంది. మనలోని లోపాలను పోగొడుతుంది. కీర్తి కలిగిస్తుంది. ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒకటేమ.....

సీ. తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయిననాడు వెంటరాదు
లక్షాధికారైనా లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జన జేసి విఱ్ఱవీగుటే కాని
కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే. తుగకు దొంగలకిత్తురో దొరల కవునో
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ పురని.....

తివిరి యిసుమను తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖల మనసు రజింపరాదు
భావం: ఇసుకును పిండైనా సరే అతికష్టమ్మీద దానిలోంచి నూనె తీయవచ్చు. ఎండమావ్వుల్లోంచి నీళ్లు తాగవచ్చు. కావాలనుకుంటే లోకమంతా తిరిగి ఎక్కడైనా కుందేటి కొమ్ము సాధించవచ్చు. కాని మూర్ఖుని మనసు సంతోషపెట్టడం చాలా కష్టం.
...

వనితా! కృష్ణుని నల్లని మేఘమనియున్
వేణురవము గర్జన మనియున్
మనమున దలంచి రొప్పుచు ననవరతము
నెమలి తుటుములాడెడికంటె
భావం: కృష్ణుడు గీతలో తనను ఎవరు ఎలా ధ్యానిస్తే వారికి ఆ రూపంలో కన్పిస్తానని చెపుతాడు. ఇదే భావనను కృష్ణునితో రాసక్రీడలాడే సందర్భంలో పోతన వర్ణించిన భాగవతంలోని పద్యమిది. కృష్ణుడు మేఘమనుకునీ, వేణునాదం గర్జనమనుకునీ, నెమళ్లు భ్ర.....

నిక్కమైన మంచినీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేల
చదువపద్యమరయఁ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: విలువలేని నీలమణి ఒక్కటైనా చాలు. విలువలేని రాళ్లు తట్టడైనా పనికిరావు. అలాగే రసవత్తరమైన పద్యం ఒక్కటైనా చాలు. భావశుద్ధిలేని పద్యాలు నిరర్థకమే కదా.
...

భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాది సంయుక్తిదా
భ్రమరంభై ఖగవీధి నాడు ననిన, న్భావించి నిన్నాత్మనె
య్యముతో ధ్యానము సేయు మర్త్యుడును నీ యట్లే పరవ్యోమ త
త్త్వము నందవ్యయలీల నుండు టరుదే భావింప? సర్వేశరా
భావం: తుమ్మెద కీటకాన్ని తెచ్చి దాని గూటిలో పెట్టి భ్రమర శబ్దం చేస్తూ గూటి చుట్టూ తిరుగుతుంది. కొన్నాళ్లకు కీటకం భ్రమరమౌతుంది. అలాగే ని.....

అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థమలచ్ఛాయమై
సుమహావర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్త నార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై
భావం: వేదవ్యాసుడొక ఉద్యానవనము. అందు భారతము పారిజాతము వంటింది. ఆ చెట్టు ఆఖ్యాన ఉపాఖ్యానము లనెడి వివిధ శాఖలతో విరాజిల్లుచున్నది. నాల్గువేదముల.....

కర్మగుణములన్ని కడబెట్టి నడువక
తత్వమేల తనకు తగులు కొనును
నూనెలేని దివ్వె నువ్వుల మండునా
విశ్వదాభిరామ వినురవేమ
భావం: దీపం నూనె వలన మండుతుందేగాని, నువ్వులతో సాధ్యంకాదు. అట్టే మనలోని చెడు ఆలోచనలను వీడనాడి, సత్కర్మలను ఆచరించినప్పుడే తత్త్వజ్ఞానం అర్థమవుతుంది.
...

కరకమలంబునందుఁ బటికంపుఁ గమండలు పచ్చకాంతి భా
సురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట బ్రహ్మచారియై
పరంగిన హంసమున్ బిలిచి బాల మృణాళముఁ జూపు చందమౌ
సిరి దిలకింప నొప్పు బుధసేవిత మూర్తిఁదలంతు భారతిన్.
భావం: ప్రబంధపరమేశ్వరుని నృసింహపురాణంలోనిదీ సరసర్వతీ పార్థన. భారతి యొక్క ఒక కరము నందు హంసాకృతిలో స్ఫటిక కమండలువు ఉన్నది. మరొక హస్తపద్మంలో మౌ.....