
మూలకథ రచన: అంటోన్ చెకోవ్
ఒకానొక శరత్కాలపు నిశిరాత్రి వేళ, తన గదిలో అటూ, ఇటూ పచార్లు చేస్తూ, పదిహేనేళ్ల కిత్రం ఇదే శరత్ ఋతువు సాయంత్రం తాను ఇచ్చిన ఒక విందును గురించి ఒక బ్యాంక్ ఉద్యోగి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ విందులో ఎంతోమంది వివేకవంతులు, విద్యావంతులు అతిథులుగా పాల్గొని, అనేక విషాయలపై సంభాషణలు సాగించారు. అందులో ముఖ్యమైనది మృత్యు.....
తెలుగు తీయనైనది. సొగసైన నుడికారం కలది. మధురమైన కవితలు కలది. సొగసైన రచనలు, సామెతల, జాతీయాల, సూక్తుల సొబగును కూర్చుకున్న మధుర భాష. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు, అన్నీ ఉన్న ఈ భాషను, సంస్కృతిని పరిరక్షించే తెలుగువారు ఆనాడు, ఈనాడు కూడా కరువయ్యారు. ఇక తెలుగు గ్రామీణుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, పండగలు పబ్బాలు, గ్రామీణ దేవతలు, పూ.....
మూలకథ రచన: ఆంటోన్ చెకోవ్
తొమ్మిదేళ్ల వ్నాకా జుకోవ్ గత మూడునెలలుగా అల్ యహీన్ అనే చెప్పుల వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. అది క్రిస్మస్ ముందు రోజు రాత్రి కావటంతో వ్యాపారి, ఆయన భార్య, మిగిలిన పనివారందరూ చర్చికి ప్రార్థనలు చేయడానికి వెళ్లారు. ఆ అదును చూసుకుని వ్నాకా వ్యాపారి బీరువాలోంచి సిరాబుడ్డీ, పాళీ ఉన్న కలం తీసుకొని, ఒక నలిగిన కాగి.....
కావ్యాలలో కవిత్వానికి మూలమూ, హేతువూ అలంకారాలు. పూర్వం నుండీ మనకున్న సంస్కృత, తెలుగు కావ్యాల్లో ఈ అలంకార ప్రయోగాలు ప్రస్ఫుటంగా, విరివిగా కనిపిస్తాయి. అలంకారాలంటే పోలికలు. ఒక వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, వ్యక్తిని కానీ, వారి గుణగణాల్ని కానీ ప్రత్యేకంగా వేరొక దానితో కలిపి పోలిక కట్టి చెప్పడమే అలంకారం. వస్తువుని బట్టీ, పోలికల తీరున.....
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది – ఏమిటో చెప్పుకోండి. అంటే తడుముకోకుండా కవ్వం! అని చెప్పెస్తాం. చిన్నప్పటి నుంచి ఇలా అనేక ఆహ్లాదకరమైన పొడుపు కథల ద్వారా విజ్ఞాన సారాన్ని తల్లులు తమ పిల్లలకు చేరవేస్తూనే ఉన్నారు. మౌఖిక ప్రచారం ద్వారా జనజీవన స్రవంతిలో భాగమై పోయిన పొడుపు కథలు మన తెలుగుతనానికి, సాహిత్.....
మూలకథ రచన: రే బ్రాడ్ బెరి
నవంబరు మాసంలో సన్నని పొగమంచులో రాత్రి ఎనిమిదింటి నిశీధి సమయాన, అల్లి, బిల్లి రహదారులను దాటుకుంటూ, మెత్తని పచ్చికల మధ్య జేబులో చేతులు దూర్చి నగరపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నడవటమంటే లియోనార్డ్ మీడ్ కు ఎంతో ఇష్టం. ఆకాశం నుంచి జాలువారుతున్న సిరివెన్నెల కాంతుల మధ్య నాలుగు రహదార్లు కలిసే కూడలి అంచున నిల్చుని .....
మూలకథ రచన: లియో టాలిస్టాయ్
ఒకానొక సమయంలో ఒక రాజుకి ఒక సందేహం కలిగింది. ఒక పని చేయాలంటే ఏది కీలకమైన సమయము? ఎలాంటి గుణగణాలున్న వ్యక్తి చెప్పే మాటలు వినాలి మరియు ఎలాంటి వ్యక్తుల సాంగత్యాన్ని వదలుకోవాలి? ఏది అతి ముఖ్యమైన పనో తెలిసేది ఎట్లా? ఈ విషయాలు తెలిస్తే తాను చేసే ఏ పని కూడా విఫలం కాదనే అభిప్రాయం కలిగింది.
ఈ ఆలోచన కలిగిన మరుక్షణం, తన.....
మూలకథ రచన: యుజీనియా.డబ్ల్యు. కాలియర్ (1969)
నా చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకుంటే, నాకు కన్పించేది నా స్వగ్రామం – ధూళి. వేసవి కాలంలో పొడారిన, నిర్జీవమైన గోధుమ రంగులో మెరిసేటి సన్నని ధూళి. నా నల్లటి కాళ్ల మధ్యలో, గొంతుకలో దూరే ధూళి. కళ్లలో పడి కన్నీళ్లు తెప్పించే ధూళి. ఎందుకు కేవలం ధూళి మాత్రమే గుర్తుకు వస్తుంది? అంటే ఏమో చెప్పలేను. తప్పకు.....
మా యిల్లు దాటి, ఆ యిల్లూ దాటి ఆ యిల్లూ దాటి నడుస్తున్నాను వీధిలో. ఆ మూలమలుపు నుంచి, పూరి గుడిసె నుంచి ఒక పాట వినిపిస్తోంది. అది కేవలం గాత్రం నుంచి ఉబికిన పాట కాదు. దానికో వాద్యంతోడు కూడా ఉంది. వాద్యమంటే ఏ వాయులీనమో, హార్మోనియమూ, వీణో, వేణువో కాదు. ఏమిటా వాద్యం? అది గానానికే కాదు, మానానికీ తోడుగా ఉంటుంది. దాని పేరు రాట్నం. రాట్నం వడుకుతూ, ఆ ఝం.....
‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని తాత్వికుల అభిప్రాయం. పెద్దగా నవ్వటం అమృత హృదయుని లక్షణమని పెద్దలంటారు.
‘‘నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు – కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వులు వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్క విశుద్ధమైనవే
నవ్వులు – సర్వము దుఃఖదమనం.....
హరికిదొరికెనందురా సిరియపుడె
దొరికెకాదె విషము హరునకరయ
ఎవనికెట్టులగునొ ఎవ్వడెరుంగును
విశ్వదాభిరామ వినురవేమ
క్షీరసాగర మథనం
క్షీరసాగర మథనంలో ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ హరిని చేరింది. అప్పుడే పుట్టిన హాలాహలాన్ని హరుడు మింగటంతో ఆ విషం శివుని కంఠంలో స్థిరపడింది.
దేవదానవులు మందరగిరి వద్దకు వెళ్లి దానిని సాగరంలోకి చేర్చాలన.....
అధిక్షేప శతక కర్తలలో ఆద్యులు కవిచౌడప్ప, వేమన, కూచిమంచి సోదరులు, అడిదము సూరకవి అనువారు ప్రముఖులు. చౌడప్ప ఆనాటి మండలేశ్వరుల, అధికారుల, ధనికుల అభిరుచినే ఆయుధముగా గ్రహించి, వారి పద్ధతి లోనే బూతులలో నీతులు చొప్పించినాడు. బూతులు కేవలం ఆశ్లీలోక్తులు కావు. వ్యంగ్య చమత్క్రుతులతో, కవితా సంపదతో, అధిక్షేపాత్మకమైన నీతిబోధనలతో పూర్ణములయినవి. ఆత.....