ఆధ్యాత్మికము

ఆధ్యాత్మికము

శాక్తేయులానుసారం సృష్టి శివశక్తి విలసితము. దైవము, దేవత, సృష్టి, స్థితి, లయములు, కాలము, దేశము సర్వము శివశక్తిమయములు. పంచభూతములు, సూర్యచంద్రులు, అగ్ని అను అష్టమూర్తులు శివశక్తి సంయములు. ‘ఆస్తి’ అనగా ఉన్నది. శివుడు ఒక్కడే కాడు. శక్తితో కూడి ఉన్నదే ఉండుట. శివశక్తి ద్వయమే కాని ఒక్కటికాదు. ఆస్తి భాతి ప్రియం అయిన పరమాత్మ తానే రెండు రూపములు ధరి.....
12. వరాహ పురాణం శ్రీమహావిష్ణువు ఎడమచీలమండలంగా అభివర్ణించే ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పన్నెండవది. ‘విష్ణునా భిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే’ అన్న శ్లోకాన్ని బట్టి ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు భూదేవికి వినిపించాడని తెలుస్తోంది. కాగా మనుకల్పంలో విష్ణువు పృథ్వికి మొట్టమొదటసారిగా బోధించిన ఈ వరాహ పురా.....
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటినుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్సు అపూ పదానికి ధర్మం అని అర్ధం. ‘ధనుర్మాసం’ అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ మాసం వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైనది. సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలంకారప్రియుడైన విష్ణువును బ్రాహ్మీ ముహర్తంలో పంచామృతంతో అభిషేకించి, .....
‘తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్ధసార సంగ్రహమ్,’ వేదాంతసారమంతా భగవద్గీతలో నిక్షిప్తమయుంది. అటువంటి ఉపనిషత్తులసారాన్ని, సర్వోపనిషదో గావో దోగ్దా గోపాలనన్ధనః పార్ధో వత్సః సుధీర్భోక్తా దుగ్దమ్ గీతామృతం మహత్ శ్రీకృష్ణభగవానుడు ఉపనిషత్తులనే గోవుల నుంచి అర్జునుడనే దూడ కోసం గీత అనే అమృతాన్ని పితికి అందించాడు. ఈ అమృతం భగవద్గీత పఠించ.....
విఘ్నసంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు విఘ్నాలు కలుగినప్పుడు, బ్రహ్మ ఓంకార ధ్యానంచేయగా, ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవతేజమే అటుతర్వాత పార్వతీపరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది. శివశక్తుల సమైక్యతత్త్వం, ప్రకృతీపురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో ద్యోతక.....
8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం: దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా | ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ | రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ | కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || అమ్మవారి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రమని కూడా కథ.....
భారతదేశంలో విభిన్న సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు. పేర్లు, పద్దతులు వేరైనా కొన్ని పండగలు దేశమంతటా ప్రసిద్ది చెందాయి. శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతాలు పూర్తికాగానే భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు ఇక ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు మన తెలుగువారే కాక ఉత్తర, దక్షిణాది వారంతా పెద్ద యెత్తున జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సావ.....
8.అగ్ని పురాణం ఈ అగ్ని పురాణము గురించి, దీని విశిష్టత గురించి ఇదే పురాణములో 271వ అధ్యాయములో ఈ విధంగా వివరింపబడి వుంది. అగ్నిరూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి: ఆగ్నేయ పురాణస్య వక్తా శ్రోతా జనార్ధన: తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేదమయం జగత్ సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం పరం సర్వాత్మహరిరూపం హి పఠతాం శృణ్వతాం నృణాం విద్యార్థినాం చ విద.....
దిబ్బు, దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అంటూ పిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ, ఇల్లంతా దీపాలు అలంకరించి, మతాబులు, టపాకాయలు వెలిగిస్తూ సందడిగా సాగే దీపావళి పండుగ కోసం చిన్నా, పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. దీపావళి పదాన్ని విడదీస్తే దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం. ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంల.....
సృష్టి, స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలలో శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకున్నాయి. శివపురాణం మనకు ఈ శక్తిపీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడు.....
7. మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాలలో ఏడవదయిన మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు ప్రప్రథమంగా జైమినికి బోధించాడు. నూటముప్పది నాలగు అధ్యాయాలు, తొమ్మిదివేల శ్లోకాలు కల్గిన మార్కండేయ పురాణం విష్ణుమూర్తి కుడిపాదంగా అభివర్ణిస్తారు. అయితే ఇందు కేవలం 6900 శ్లోకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ పురాణమందు విస్తరస్త్రోతకీర్.....
‘‘పరిత్రాణాయ సాధూనా, వినాశాయచ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగే, యుగే’’ సాధు పరిత్రాణం, దుష్కృత వినాశం, ధర్మ సంస్థాపన – ఈ మూడు పరయోజనాల సిద్ధికి తాను మళ్లీ, మళ్లీ అవతరిస్తానని భగవంతుడు గీతలో తెలిపాడు. ఎవరీ సాధువులన్నదానికి కూడా భగవంతుడు గీతలో సమాధానమిచ్చాడు. ఆర్త భక్తులు, జిజ్ఞిసువులు, అర్థకాములు మరియు తత్త్వజ్ఞానులు. వ.....