
శరన్నవరాత్రులు పదిరోజుల ఉత్సవం. శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో అమ్మవారిని పూజిస్తారు. అందువల్లనే ఈ ఉత్సవాలని ‘దేవీ నవరాత్రులని’ కూడా పిలుస్తారు. పండుగ మొదటి మూడురోజులు పార్వతీదేవిని, తర్వాతి మూడురోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు సరస్వతీదేవిని పూజిస్తారు. అందు తొలిరోజు కనకదుర్గాదేవి, రెండోరోజు బాలా త్రిపుర స.....
మన తెలుగునాట అనేక పండుగలు ప్రకృతితో, ఋతుపరివర్తనతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చిన సందర్భంగా జానపదులు ఉత్సాహంతో తమకు ఆనందాన్ని కల్గించిన పుడమితల్లిని, పశుసంపదను పూజించి కృతజ్ఞతలు తెలుపుకుని పండుగలు జరుపుకుంటారు. తెలంగాణా ప్రాంతీయులు జరుపుకునే అలాంటి విశేషమైన పండుగలే బతుకమ్మ -బొడ్డెమ్మ పండుగలు.
వినాయక చవితి లేదా భ.....
విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమచైతన్యి జగదంబగా ఆరాధించే సాంప్రదాయం శాక్తేయం. ఏ ‘శక్తి’ వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాగమాల వరకు ఆ జగన్మాతను దేవీ నామంతో కీర్తించాయి. ఈ నామానికి ‘ప్రకాశ స్వరూపిణి’ అని అర్ధం. అన్నింటికీ చైతన్యాన్ని ప్రసాదించే స్వయంప్రకాశక శక్తి దేవి. మరొక అర్ధం క్.....
జానపదుల రామాయణ గాథలో అనేక అవాల్మీకాలు వచ్చి చేరాయి. అయితే ఈ గాథలన్ని జైన, కంబ మొదలగు అనేక రామాయణాల ప్రేరణతో వచ్చి ఉండవచ్చు. కుశ, లవుల జన్మవృత్తాంతంలో కూడా ఇలాగే అనేక కథలు జానపద గాథలలో ప్రచారం పొందాయి.
జానపదుల కుశాలయకము:
రాముని అవతార ఉద్దేశం తీరినది కావును తిరిగి భగవంతుని వైకుంఠానికి రప్పించమని దేవతలు బ్రహ్మను ప్రార్థిస్తారు. అందు.....
‘భగవతః చరితం భాగవతమ్’. భగవంతుని చరితము భాగవతము. ప్రపంచోత్పత్తి, ప్రళయము, భూతలముల ఆగమనగమనములు, విద్యావిద్యలు ఎవరికి తెలియునో ఆతడు భగవంతుడని ప్రాచీన పండితులు నిర్ధేశించారు. నిర్గుణ, సుగుణాత్మకుడైన ఆత్మస్వరూప నిరూపణమే భాగవత కథ. వ్యాసుడు రచించిన అష్టాదశపురాణాలలో అత్యంత విశిష్టమైనది భాగవతం. గాయత్రి ఆధారంగా ధర్మ ప్రబోధము కలిగి, 18వేల శ్.....
సంస్కృతంలో భవభూతి రచించిన ‘ఉత్తర రామచరితం’ అనే నాటికను తెలుగులో తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ గా, కంకంటి పాపరాజు ‘ఉత్తర రామయణం’గా అనువదించారు. ఉత్తర రామాయణాన్ని తిక్కన నిర్వచన కావ్యంగా మల్చగా, కంకంటి పాపరాజు చంపు కావ్యంగా రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రాముడు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తుండగా, 24000 శ్లోకాలు, 500 సర్గలు ఉత్తర క.....
హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా వివరించపడి ఉంది. హనుమంతుడు వైశాఖమాస కృష్ణపక్షమున శనివారం పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతి యోగమున మధ్యాహ్న సమయమందు కర్కాటక లగ్నాన కౌండిన్య గోత్రమున జన్మించాడు.
'రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపపడే హనుమంతుడు, వేదములన.....
పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడమాసంగా వ్యవహరిస్తాము. ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసమని కూడా అంటారు. ఈ మాసంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి తిరిగి సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశించేంత వరకు దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణిస్తాడు. ఈ మాస.....
5. శ్రీమద్భాగవత పురాణం
‘భాగవతః ఇదమ్ భాగవతమ్’ – భగవంతుని కథలు చెప్పేది భాగవతం. ‘భా’ అంటే భక్తి, ‘గ’ అంటే జ్ఞానం, ‘వ’ అంటే వైరాగ్యం, ‘తం’ అంటే తత్త్వం అనే అర్థాలతో భక్తి, జ్ఞాన, వైరాగ్యములను పెంపొందించే పురాణంగా శ్రీమద్భాగవతం సార్థకమైనది. అష్టాదశ మహాపురాణాలలో అయిదవదైన శ్రీమద్భాగవతం శ్రీ మహావిష్ణువు యొక్క ఊరః (తొడలు) గా అభివర్ణిస్తారు. .....
చిగురింతతో మొదలై, ఆకురాలటంతో పూర్తయ్యే సంవత్సరచక్రం జీవగమన వైఖరి తెలియచేస్తుంది. చిగురింతలూ, శిశిరాలు జరిగినా వృక్షంలో మార్పుండదు. సంవత్సరాలు గడుస్తున్నా జగతిలోనూ మార్పుండదు. సృష్టి, స్థితిలయలకు సంవత్సరం ఒక ప్రతీక.
ఉగం, యుగం ఈ రెండు ఒకే అర్ధంతో ప్రయోగించిన శబ్ధాలు. యుగానికి ఆది... యుగాది. కల్పాది కూడా ఇదే. ఈ శ్వేతవరహకల్పం, చైత్రశుద్.....
వసంత రుతువు ఆరంభంలో వచ్చే ప్రధాన పండుగ ఉగాది లేదా యుగాది. 'యుగము' అనగా ద్వయము లేక జంట అని అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. కాలక్రమేణా యుగాది ఉగాదిగా స్థిర పడింది. అయితే "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గ’ అంటే జ్ఞానం అనే అ.....
మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం .... ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన.
శ్రావణ మాసం కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. వర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం’ అని శ్రీ సూక్తం వర్ణించినట.....