

శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!
భావం: నక్రగ్రహ అంటే మొసలిని చంపినట్టి; సర్వలోక అంటే అన్నిలోకాలకు; నాయక అంటే అధిపతివైనట్టి; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; శక్రసుతున్ అంటే ఇంద్రుని కుమారుడైన అర్జునుని; కాచుకొరకై అంటే రక్షించడానికిగాను; చక్రము అంటే సుదర్శన చక్రాన్.....