పద్య సౌరభం

పద్య సౌరభం

నీ మహనీయతత్త్వరస నిర్ణయబోధ కథామృతలబ్ధిలోఁ దానునూగ్రుంకులాడక వృథాతను కష్టముజెంది మానవుం డీ మహిలోక తీర్థముల నెల్లమునింగిన దుర్వికార హృ త్తామపంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ భావం: నీ మహనీయమనెడి అమృతసాగరము నందు పూర్తిగా మునిగిపపోయినచో జ్ఞానము చేకూరును. మనస్సు నందలి మాలిన్యము నశించును. అంతేకాని శరీరమును కష్టపెట్టి తీర్థయాత్రల.....
దిక్కెవ్వరు ప్రహ్లాదకు దిక్కెవ్వరు పాండుసుతులకు దీనుల కెపుడున్ దిక్కెవ్వర య్యహల్యకు దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా భావం: పరమభక్తుడైన ప్రహ్లాదునకు, పాండవులకు, అహల్యకును ఎవరైతే రక్షకుడో ఆ కృష్ణుడే నాకును, మీకును రక్ష. ...
ముదమునకాటపట్టు, భవమోహమదద్విరదాంకుశంబు, సం పదలకొటారు, కోరికల పంట, పరంబునకాది, వైరుల న్నదలజయించు త్రోవ విపదబ్ధికి నావ గదా సదా భవ త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధి. భావం: రామా అను నీ నామస్మరణ శాశ్వతానందము కల్పించునటువంటిది. మోక్షమునకు మూలము. ఆపదల సముద్రమునకు నావ. మోహమనెడి మదించిన ఏనుగును అంకుశము వలె పొడుచును. ఐశ్వర్యముల నిచ్చు ధనా.....
అది సభయే ప్రియంబెసఁగ నార్యులు నిల్వరయేని నార్యులే మదిఁదలపంగ వారలు సమంచిత ధర్మలు వల్కరేని, న ట్టిదియును ధర్మువే తగ ఘటించి నిక్కము లేద యేనిఁ దా బదిలపు నిక్కమే యొక నెపం బిడు చొప్పగునేని భూవరా. భావం: పూజ్యులైన పెద్దలు ఏ సభలో ఉండరో, అది సభ యగునా? ఆలోచించగా ఆ సభలో నున్న పెద్దలు సముచితమైన ధర్మం చెప్పని పక్షంలో వారు ఆర్యులు కాగలరా? వారు చెప్ప.....
సరి వారి లోన నేర్పున దిరిగెడి వారలకు గాక తెరువాటులలో నరయుచు మెలిగెడి వారికి పరు వేటికి గీడె యనుభవంబు కుమారా భావం: నీతోటి వారితో మెలిగేటప్పుడు వారు మంచివారైనచో నీకును గౌరవము లభించును. ఆవిధంగాకాక దొంగబుద్ధి కలవారితో తిరిగినచో నీకును చెడు స్వభావము, అగౌరవము లభించును. ...
కలిమిగల లోభి కన్నను విలసితమగు పేద మేలు వితరణియైనన్ చలి చెలమ మేలుకాదా కులనిధి యంభోధి కన్న గువ్వల చెన్నా భావం: డబ్బున్న పిసినారి కంటె, ధనంలేిని పేదవారు నయం. పెద్ద సముద్రం కంటె తాగడానికి నీరిచ్చే తియ్యని నీళ్లున్న చిన్న చెలమ మేలు కదాని దీనర్ధం. ...
ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ భావం: తనకు సహాయం చేసిన వారికి మేలు చేయడం గొప్పేమి కాదు. కాని అపకారం చేసినవాడికి కూడా, వాడి అపకారములను లెక్కించక ఉపకారం చేసేవాడే ఉత్తముడు. ...
కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా! భావం: అందరిని రక్షించే కృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తున్న నీవు ధన్యుడవు. ...
కరములుమీకు మ్రొక్కు లిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనుల భవత్కధలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టుపూసరుల కానగొనం బరమాత్మ సాధనో త్కర మిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ. భావం: చేతులు నీకు నమస్కరించుచున్నమి. కన్నులు నిన్నె చూస్తున్నాయి. నాలుక నిన్న మాత్రమే స్మరిస్తున్నది. వీను నీ కథామృతమును గ్రోలుచున్నవి. నాసిక నీ పూలపర.....
ఏ వేదంబు పఠించె లూత? భుజగంబే శాస్త్రము ల్చూచె? దా నే విద్యాభ్యసనంబొనర్చెఁగరి? చెంచెమంత్ర మూహించె? బో ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు: మీపాద సం సేవాసక్తి యెకాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! భావంః ఏ వేదాలను పఠించి సాలెపురుగు, శాస్త్రాలు తిరగవేసి పాము, ఏ విద్యలను ఏనుగు, ఏ మంత్రాలు వల్లించి తిన్నడు కైవల్యాన్ని పొందారు. చదువులు జ్ఞ.....
పుట్టువు లేని నీ కభవ పుట్టు క్రీడయ కాక పుట్టుటే? యెట్టనుడున్ భవాదిదశ లెల్లను జీవులయం దవిద్య దాఁ జుట్టుచు నుండుఁ గాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం జుట్టఁగ లేమిఁ దత్క్రియలఁ జొక్కని యెక్కటి వౌదు వీశ్వరా భావం: పుట్టు ఎరుగని నారాయణా నీకు పుట్టుకంటూ వేరే లేదు. ఇలా పుట్టుట నీకు క్రీడ కాని పుట్టుక కాదు. జన్మ, మరణం జీవులను మాయ కారణంగా ఆ.....
అంతఁగడంక రాముడు సమగ్ర భుజాలుల విక్రమోత్సవం బెంతయు బర్వ మౌర్వి మొరయించె దిగంతర దంతి కర్ణరం ధ్రాంతర సాగరాంతర ధరాభ్ర తలాంతర చక్రవాళ శై లాంతర సర్వ భూధర గుహోకుహరాంతర పూరితంబుగన్ భావం: శ్రీరాముని ధనుష్టంకారాన్ని ఈ పద్యం వర్ణిస్తుంది. మౌర్వీరవం దిగంతరాల్లో, ఎనిమిది దిక్కులో వుండే దిగ్గజాల శూర్ప కర్ణాల వివరాలలో హ్రీంకారించింది. సముద్ర.....